అభినందన్ ఒక్క ఇండియా హీరోనే కాదు.. పాకిస్థాన్‌కు కూడా.. ఎలాగంటే?

-

అభినందన్.. ఈపేరును ఇండియన్స్ మరిచిపోలేరు. ఆయన ధైర్యసాహసాలకు ఇండియన్సే కాదు… ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. చివరకు పాకిస్థాన్ కూడా ఆయనకు ఫిదా అయిపోయింది. శత్రువులకు చిక్కినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసి దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు చిక్కకుండా అత్యంత తెలివిగా వ్యవహరించిన అభినందన్‌ను మెచ్చుకోని వాళ్లు ఉండరు. ఆయన ఇండియా హీరో. అయితే.. సహజంగా ఆయనకు భారత్‌లో అభిమానులుండొచ్చు కానీ.. మన శత్రు దేశం పాకిస్థాన్‌లోనూ ఉంటే. అదే ఇక్కడ విచిత్రం. ఆయన్ను పాకిస్థాన్ పౌరులు కూడా అభిమానిస్తున్నారు.. అనడానికి మీరు పైన చూస్తున్న ఫోటోయే నిదర్శనం.

Pakistan tea seller uses abhinandan photo as banner in his tea stall

పాకిస్థాన్‌కు చెందిన ఓ చాయ్ వ్యాపారి.. తన టీ స్టాల్ ముందు అభినందన్ పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు చాయ్ తాగిన ఫోటోతో ఉన్న బ్యానర్‌ను ఏర్పాటు చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆ బ్యానర్‌ను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఇది మామూలు చాయ్ కాదు.. శత్రువును కూడా మిత్రుడిగా మార్చేది.. అంటూ ఆ పాకిస్థానీ క్యాప్సన్ పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news