ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

-

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే … టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.  గడిచిన మూడు రోజుల కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

కరోనా వల్ల దేశంలో రోజుకు కేసుల సంఖ్య పెరగుతోంది. రాష్ట్రంలో కూడా కేసులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. దీంతో పాటు మరోవైపు ఓమిక్రాన్ కేసులు విస్తరించిడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే థర్డ్ వేవ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో పాటు ఆయన సతీమణి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. దీంతో వారి అనుచరుల్లో ఆందోళన నెలకొంది. తమ నాయకులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news