మెగా భేటీకి ఆ ఇద్ద‌రూ..! చ‌లో విజ‌య‌వాడ!

-

గా భేటీకి అంతా సిద్ధం అవుతోంది
విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రిగే చ‌ర్చ‌ల‌కు
చిరుతో స‌హా యువ హీరోలు ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు
కూడా వెళ్తున్నారు.తార‌క్ కూడా వెళ్తారని అనుకున్నా
ఎందుక‌నో ఆయ‌న ఆగిపోయారు.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

ఇవాళ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధం అవుతున్నారు.ఆయ‌న‌తో పాటు యువ హీరోలు ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు కూడా ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. వీరు ఇరువురూ హైద్రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరారు. ముఖ్య‌మంత్రితో భేటీకి హాజ‌ర‌వుతున్న వారిలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కొర‌టాల శివ కూడా ఉన్నారు. మ‌రోవైపు భేగంపేట విమానాశ్ర‌యంలో చిరు మాట్లాడుతూ.. సీఎంఓ నుంచి త‌న‌కు మాత్ర‌మే ఆహ్వాన‌ముంద‌ని అన్నారు.

నాతో పాటు ఎవ‌రు వ‌స్తున్నారో కూడా తెలియ‌దు అని కూడా చెప్పారు. సీఎంను క‌లిశాక అన్ని విష‌యాలూ మీతో మాట్లాడ‌తాను అని అంటూ వెళ్లిపోయారాయ‌న. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ సినిమా టికెట్ ధ‌ర‌లు త‌గ్గింపు విష‌య‌మై ఇప్ప‌టిదాకా నెల‌కొన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయితే చాలు అని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

మ‌రోవైపు మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కూడా ఇవాళ్టితో స‌మ‌స్య‌లు అన్నింటికీ శుభం కార్డు ప‌డుతుంద‌ని భావిస్తున్నాన‌ని అన్నారు.ఇదే విశ్వాసం ఇంత‌కుమునుపు చిరంజీవి కూడా అన్నారు.ఇక టికెట్ ధ‌ర‌ల‌కు సంబంధించి ఇవాళ జ‌రిగే చ‌ర్చ‌ల్లో సానుకూల‌త వ‌స్తుంద‌ని అంతా అంటున్నారు.ఇక థియేట‌ర్ల విష‌య‌మై కొన్ని దాడులు చేయ‌డం వాటిపై కూడా కొన్ని కేసులు న‌మోదు చేయ‌డం వంటి వాటిపై కూడా ఇవాళ స‌మీక్షించ‌నున్నారు.

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌ను సీజ్ చేసే అధికారం తహశీల్దార్ కు ఉండ‌ద‌ని హై కోర్టు తేల్చేసింది. మొన్న‌టి వేళ సోంపేటకు చెందిన ఓ థియేట‌ర్ ఓన‌ర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై కోర్టు స్పందించింది. థియేట‌ర్ ను సీజ్ చేసే అధికారం లైసెన్స్ ఇచ్చే అధికారికి మాత్ర‌మే ఉంటుంద‌ని తేల్చేసింది హై కోర్టు. దీంతో జ‌గ‌న్ వ‌ర్గాలు మ‌రియు సంబంధిత యంత్రాంగ వ‌ర్గాలు ఖంగుతిన్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాను. ఇప్ప‌టిదాకా తీసుకున్న నిర్ణ‌యాల‌పై పునఃస‌మీక్ష‌కు ఇవాళ అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది. ఇప్ప‌టికే జ‌న‌వ‌రిలో జ‌రిగిన లంచ్ మీట్ లో కొన్ని విష‌యాలు చిరుతో జ‌గ‌న్ చ‌ర్చించారు. వాటికి కొన‌సాగింపుగానే నేటి(10.02.2022) భేటీ ఉంటుంది. చ‌ర్చ‌ల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

– సినీలోకం – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news