తన పని తాను చేసుకుని పోతాడు
రాముడే దిక్కు అని చెబుతాడు
భారం అతనిపై వేశాను కదా అని
బాధ్యత మరువడు
ఓ విధంగా ఒన్ మేన్ ఆర్మీ అతడే ఆదిత్య నాథ్ యోగి
నాథ్ నాథ్ నాథ్ మేరా యోగి నాథ్ అని బీజేపీ పాడుతున్నదీ ఇందుకే !
ఎన్నికలు ఎప్పుడయినా ఎలా ఉన్నా సరే మాదే విజయం అని విర్రవీగిన పార్టీలూ ఉంటాయి.లేదా తమ పని తాము చేసుకుని ప్రజల మెప్పు పొందాలన్న తాపత్రయంలో కాకుండా కర్తవ్య దీక్షలో భాగంగా పనిచేసే పార్టీలూ ఉంటాయి.వీటిలో ఏది గొప్ప ఏది మంచి అని తేల్చడం కష్టం.కొన్నిసార్లు మితిమీరిన ప్రచారం చెడు చేస్తుంది.కొన్ని సార్లే అది ఆకర్షణ మంత్రం అయి ఉంటుంది. అప్పుడు అబద్ధం ఎక్కువ కాలం రాణించడం అన్నది జరగని పని!
అందుకే ఈ సారి యోగి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.మోడీ కన్నా తన ప్రభావమే ఎక్కువగా ఉంటుందని తనను ప్రజలు మరో మారు నమ్మడం ఖాయం అని కూడా ఎన్నో సార్లు స్పష్టం చేశారు యోగి తన చేతల ద్వారా..! ఆ విధంగా మాటలు కన్నా చేతలే అమితామితంగా ప్రభావితం చేశాయి.అదేవిధంగా యోగి గెలుపునకు కారణం అయ్యాయి. ఇక ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు కూడా యూపీలో మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవాల్సిన రోజు కూడా దగ్గర పడిపోయింది. స్థిరమయిన నాయకత్వం లేని కారణంగా కాంగ్రెస్ ఎప్పటిలానే చతికిల పడిపోయింది. ఓ విధంగా ఆపార్టీకి ఇది ఒక చావు దెబ్బ. దీన్నుంచి తేరుకోవడం, తేరుకొని మాట్లాడడం అన్నవి జరగని పనులే!