91 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ పై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన

-

91 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ పై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే భర్తి ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. దేశ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు కి ఒక సారి నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. బిస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పీ ఆర్ సి కి సంబంధించినదన్నారు. బిస్వాల్ రిపోర్ట్ రెండు రకాలు గా ఇచ్చారని.. 211 శాఖలు లో కలిపి శాంక్షన్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్ లో పొరపాటున బిస్వాల్ కమిటీ జీరో చూపించారని వెల్లడించారు.

54,118 గవర్నెమెంట్ బయట పని చేసే వారిని జీరో గా చూపించారని.. 54118 తీసివేస్తే 136534 ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఉంటాయన్నారు. ప్రమోషన్ లు ద్వారా నింపే ఖాళీలు 48654 అని.. హాఫ్ నాలెడ్జ్ , సగం తెలివి గల వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. బిస్వాల్ కమిటీ ప్రకారం 87880 పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని.. దేశానికి ఈ బడ్జెట్ ఆదర్శమని.. దేశానికి తెలంగాణ మోడల్ అని వెల్లడించారు. గతంలో సభ కి ఎండిపోయిన కంకులు, కుండలు పట్టుకుని వచ్చేవారని.. 11 రాష్ట్రాలు ప్రజలు తెలంగాణా కి వలస వస్తున్నారన్నారు.

దేశం లో మైనార్టీ ఎడ్యుకేషన్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని.. జీవన్ రెడ్డి నిజాలు చెప్తే బాగుండేది, బురద చల్లేలా మాట్లాడారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో పోలీస్ స్టేషన్ ల ముందు ఎరువులు అమ్మే దుస్థితి ఉండేదని.. ఒక్క ఏడాది తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయము మీద పెట్టిన ఖర్చు పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం లో పెట్టలేదని మండిపడ్డారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్ కి వెళ్లి చూద్దామా? ఎలాగో కాంగ్రెస్ కి పంజాబ్ పోయిందని.. దేశంలో కేంద్రం పది ఉత్తమ గ్రామ పంచాయతీ లు కి అవార్డులు ఇస్తే ఇందులో ఏడు తెలంగాణ గ్రామాలు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news