జగన్ వస్తేనే ఏపీ అభివృద్ధి : ఎస్వీ కృష్ణారెడ్డి

-

ప్రజల కోసం ఆయన పడుతున్న తపనే నన్ను కదిలించింది. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజల బాధను అర్థం చేసుకున్నారు. ఆయన తండ్రి వైఎస్సాఆర్ లాగానే జగన్ ప్రజల కోసం తపిస్తున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి… వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ చేయగలిగేదే చెబుతారని… ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశంసించారు. ఇవాళ హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Tollywood director SV Krishna reddy praises ys jagan

ప్రజల కోసం ఆయన పడుతున్న తపనే నన్ను కదిలించింది. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజల బాధను అర్థం చేసుకున్నారు. ఆయన తండ్రి వైఎస్సాఆర్ లాగానే జగన్ ప్రజల కోసం తపిస్తున్నారు. వైఎస్సాఆర్, జగన్ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయిన జగన్ ప్రకటించిన నవరత్నాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయి. జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల భవిష్యత్ బాగుంటుంది. ఆయనే ఇప్పుడు రాష్ట్రానికి అవసరం. అందుకే జగన్ ను గెలిపించి ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవండి.. అని కృష్ణారెడ్డి పేర్కొన్నారు.


సినీ ఇండస్ట్రీలో ప్రాంతీయ బేధాలు లేవు.. అంతా కలిసే ఉంటాం

సినీ ఇండస్ట్రీలో ప్రాంతీయ బేధాలు లేవు.. అంతా కలిసే ఉంటాము అని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. మేమంతా హైదరాబాద్ లో సంతోషంగా ఉన్నాం. ఎన్టీఆర్, వైఎస్సాఆర్ లాగే వైఎస్ జగన్ ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన ఓపికకు చేతులెత్తి నమస్కరించాలి. ప్రజల కష్టాలు తెలుసుకున్న జగన్.. ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు. అందుకే జగన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి.. అని అచ్చిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news