షర్మిల ఉంగరాన్ని లాగేసిన దొంగ.. వీడియో

-

ఇంతలో ఆ గుంపులోకి ఓ దొంగ ప్రవేశించాడు. షర్మిల చేతివేలికి ఉన్న బంగారు ఉంగరంపై ఆ దొంగ కన్ను పడింది. కార్యకర్తలా గుంపులో దూరి.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు.

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. సిగిరేటు అంటించుకోవడానికి నిప్పుందా అని అడిగాడట వెనకటికి ఓ వ్యక్తి. ఈ ఘటన చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. ఎవరి పని వారిది. ఎవరు ఎక్కడ పోతే మనకేం. ఎవరు ఏం చేస్తే మనకేం. మన పని మనం చేసుకోవాలి. మన వృత్తి మనం చేసుకోవాలి.. అన్నట్టుగా ఉంది.

thief robs ys sharmila ring in election rally in guntur dist

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె తన వాహనంలో నుంచి అభిమానులకు అభివాదం చేశారు. చాలామంది అక్కడ గుమికూడి ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. దీంతో ఆమె కూడా తన చేయిని కొంచెం ముందుకు చాచి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇంతలో ఆ గుంపులోకి ఓ దొంగ ప్రవేశించాడు. షర్మిల చేతివేలికి ఉన్న బంగారు ఉంగరంపై ఆ దొంగ కన్ను పడింది. కార్యకర్తలా గుంపులో దూరి.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఆమె కూడా అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది. అంతే చేయి పట్టుకొని వేలికి ఉన్న ఉంగరాన్ని గట్టిగా లాగాడు. తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఎవరో లాగుతున్నారని ఆమెకు అర్థమయింది. వెంటనే తన చేతిని వెనక్కి లాగడానికి షర్మిల ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని ఆ దొంగ లాక్కొని అక్కడి నుంచి పరారాయ్యాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Read more RELATED
Recommended to you

Latest news