దీంతో అదుపుతప్పిన పవన్ కల్యాణ్ అక్కడే కింద పడిపోయారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గమనించి పవన్ను పైకి లేపారు. మైక్ కూడా విరిగిపోయింది.
ఏపీలో ఇంకో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా బిజీ బిజీగా తమ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన విజయనగరంలో జరిగిన జనసేన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఓ వ్యక్తి పవన్ను చూసి ఆగలేక స్టేజీ మీదికి వెళ్లి ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నారు. దీంతో అదుపుతప్పిన పవన్ కల్యాణ్ అక్కడే కింద పడిపోయారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గమనించి పవన్ను పైకి లేపారు. మైక్ కూడా విరిగిపోయింది.
వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో జనసేన నిర్వహించిన బహిరంగ సభలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే.. తన కాళ్లను పట్టుకున్న వ్యక్తిని వదిలేయాలంటూ తన సెక్యూరిటీ సిబ్బందికి పవన్ చెబుతుండటం వీడియోలో రికార్డయింది. తర్వాత ఆ వ్యక్తిని వదిలేశారా? లేక పోలీసులు స్టేషన్కు తరలించారా? అనే విషయం మాత్రం తెలియలేదు.