కొడాలి నానిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. టీవీల్లో కొడాలినానిని చూస్తే బూచోడు అంటూ పిల్లలు, తల్లిదండ్రులు భయపడుతున్నారని.. సినిమా ప్రారంభం ముందు వచ్చే ఖైనీ, గుట్కా ప్రకటనలు తొలగించి కొడాలినాని వల్ల ఎంత ప్రమాదమో ఇకపై ప్రకటనలివ్వాలని చురకలు అంటించారు.
రాష్ట్ర ప్రజలు కొడాలినానిని ఓ చీడపురుగులా చూస్తున్నారని.. 420 పార్టీలో కొడాలినాని ఓ 840 అంటూ ఓ రేంజ్ ఫైర్ అయ్యారు. వైసీపీ పుట్టుకే 420ల నుంచి అని కొడాలినాని మరిచారా..? అని ఫైర్ అయ్యారు. మంత్రిపదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ సీఎం జగనుకి కొడాలి నాని పరోక్ష హెచ్చరికలు పంపారని.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలి నానిని వైసీపీ నేతలే అసహ్యించుకుంటున్నారన్నారు.
జగనులా తండ్రి అధికారం పెట్టుకుని ప్రజా ధనం దోచుకునే బుద్ధి ఎన్టీఆర్ పిల్లలెవ్వరికీ లేదని.. హరికృష్ణ ఇమేజీని డామేజ్ చేసిన వెన్నుపోటుదారుడు కొడాలి నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను జగనే హత్య చేయించారని వివేకా కుటుంబ సభ్యులంతా చెప్తున్నారని..చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరైనా చెప్పారా ? అలా ఎవరైనా చెప్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని సవాల్ విసిరారు.