యాసంగి కాలంలో… తెలంగాణ రాష్ట్ర రైతులు పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని.. టీఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కు దిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీయూష్ గోయల్ ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. పీయూష్ గోయల్ కు అసలు ధాన్యం కొనుగోళ్ల పై అవగాహన ఉందా అని నిలదీశారు. మాకు ధర్నా చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.
ధాన్యం సేకరణకు దేశంలో ఒకే విధానం ఉండాలి.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది.. ఇంతదూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు సీఎం కేసీఆర్.తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం.. నూకలు తీనమన్నాడు.. పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్ మాల్ అని సీఎం కేసీఆర్ ఆగ్రహించారు.