రెండో దశ ఎన్నికలు ముగిశాయి.. ఒక పార్టీకి ఓటేయ బోయి ఇంకో పార్టీకి ఓటేశాడో యువకుడు. ఈవీఎంపై ఉన్న రకరకాల గుర్తులను చూసి కన్ఫ్యూజ్ అయిన యువకుడు తను ఓటు వేయాలనుకున్న పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేశాడు. తాను చేసిన తప్పుకి తనను తానే శిక్షించుకున్నాడు.
విషయంలోకెళితే ఉత్తర్ ప్రదేశ్లోని బులంద్శహర్కు చెందని పవన్ కుమార్ అనే యువకుడు ఏప్రిల్ 18న జరిగిన పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు.
”నేను ఏనుగు గుర్తు(బీఎస్పీ)కు ఓటేయాలనుకుని వెళ్లాను. కానీ, పొరపాటున ఈవీఎంలో కమలం గుర్తుపై నొక్కాను” తాను కోరుకున్న పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేశానన్న బాధతో తన వేలిని కోసుకున్నట్లు ఆ వీడియోలో తెలిపారు.
A #BSP supporter chopped off his finger after he accidentally pressed wrong button in #EVM and voted for #BJP instead of BSP in #Bulandshahr #LokSabhaElection2019 pic.twitter.com/upHcH9Obvz
— Saurabh Trivedi (@saurabh3vedi) April 18, 2019