నీట్‌ పీజీ -2022 పరీక్షలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

-

జాతీయ స్థాయిలో నిర్వహించే పీజీ మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పీజీ-2022 ఈ విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆలిండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్.(AIMSA) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు నీట్ పీజీ -2020 పరీక్ష వాయిదాను నిరాకరించింది. మే 21న ఈ పరీక్ష జరగనుంది. వాయిదాతో గందరగోళం, అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుందని ధర్మాసనం తెలిపింది.

పరీక్షకు సిద్ధమైన రెండు లక్షల మంది అభ్యర్థులతో పాటు రోగులకు చికిత్స పై కూడా ప్రభావం పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. నీట్ పీజీ- 2021 కౌన్సిలింగ్ జరుగుతున్నందున ఈ సమయంలో నీట్ పీజీ- 2022 పరీక్ష వద్దని, వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది ధర్మాసనం. జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news