తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు… తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది టీఆర్ఎస్, కేసీఆర్ అని బీజేపీ విమర్శిస్తోంది. తాజాగా బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశఆరు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చే పని లేదని… వాళ్లకు వాల్లే కూల్చుకుంటారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ను భరించే శక్తి ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదని ఆయన అన్నారు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని ఈటెల అన్నారు. భయంతోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని వచ్చారని విమర్శించారు. హరీష్ రావు మీద ఉన్న భయంతోనే మంత్రి పదవి ఇచ్చాడు కానీ ఇష్టంతో కాదని ఆయన అన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటన ఎవరూ రెస్పాన్స్ కాలేదు.. జాతీయ నాయకులు కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి ఇష్టంగా లేరని అన్నారు.