డేంజర్ జోన్: ఆ మాజీ మంత్రుల సీట్లు డౌటేనా?

-

సాధారణంగా అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటితే…ఏ అధికార పార్టీపైన అయిన ప్రజల్లో వ్యతిరేకత కాస్త ఉంటుంది..ఇక అక్కడ నుంచి నిదానంగా వ్యతిరేకత పెరుగుతూ వెళ్ళితే నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది…అయితే ఇప్పుడు ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలని సీఎం జగన్ చూస్తున్నారు..ప్రస్తుతం తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతని తగ్గించే కార్యక్రమాలు మొదలుపెట్టారు.

గత మే నెలతో వైసీపీ మూడేళ్ళ అధికారాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే..అయితే ఈ మూడేళ్ళలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వచ్చింది…సీఎం జగన్ పై పెద్దగా వ్యతిరేకత రాలేదు గాని..ఆ పార్టీ ఎమ్మెల్యేలపై మాత్రం వ్యతిరేకత వచ్చింది…ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తే…దాని వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది..అందుకే ఆ డ్యామేజ్ ని తగ్గించే పనిలో ఉన్నారు జగన్..ఇకపై ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండాలని చెబుతున్నారు. అప్పటికి ప్రజల్లో ఉండకుండా వ్యతిరేకత ఇంకా పెంచుకుంటే అలాంటి వారికి నెక్స్ట్ సీట్లు కూడా ఇవ్వనని చెబుతున్నారు.

అయితే తాజాగా పార్టీ అంతర్గత సర్వేల్లోఆరుగురు ఎమ్మెల్యేలు…అసలు ప్రజల్లోకే వెళ్లలేదని తేలింది. మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు ఆళ్ల నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, ప్రసన్న కుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాపరెడ్డి..అసలు ఈ ఆరుగురు ఒక్కరోజు కూడా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనలేదట. ఇంకా మరికొందరు…ఏదో మొక్కుబడిగానే ప్రజల్లోకి వెళ్లారని తెలిసింది. ఇక వీరికి జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది..ఆరు నెలల్లో పనితీరు మారకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని అన్నారు.

అయితే మంత్రి బొత్సకు తన నియోజకవర్గం చీపురపల్లిపై గట్టిగా పట్టుంది…ఆయన తిరగకపోయిన ఇబ్బంది లేదు..కానీ మాజీ మంత్రులు అనిల్, ఆళ్ళ నాని పరిస్తితి అలా కాదు..నెల్లూరు సిటీ, ఏలూరు సిటీ నియోజకవర్గాల్లో వారిపై వ్యతిరేకత పెరుగుతుంది. అటు కురుపాంలో మాజీ మంత్రి పుష్పశ్రీ వాణి, భీమిలిలో అవంతి శ్రీనివాస్, ఆచంటలో రంగనాథరాజుపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. మరి ఎన్నికల నాటికి కూడా వీరి పరిస్తితి ఇలాగే ఉంటే…జగన్ సీటు ఇవ్వకుండా ఊహించని షాక్ ఇస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news