అచ్చెన్నా పేరుతో ఫేక్ ప్రెస్‌నోట్ వైరల్..సీఐడీకి టీడీపీ ఫిర్యాదు

-

సీఐడీ ఏడీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ ఏపీ చీఫ్ అచెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు వర్ల రామయ్య. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు ఫోర్జరీ చేసిందని.. దొంగ సంతకాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై అనేక ఫిర్యాదులిచ్చినా చర్యలు లేవని ఫైర్‌ అయ్యారు.

దోషులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. వైసీపీ మద్దతుదారులు జూన్ 13, జూలై 1 లలో ఇప్పటికి రెండు సార్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు సంతకం, లెటర్ హెడ్ లను ఫోర్జరీ చేశారని మండిపడ్డారు. అచ్చెన్న లెటర్‌హెడ్‌ను ఫోర్జరీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. అచ్చెన్నాయుడి నకిలీ లెటర్‌హెడ్ ను ఉపయోగించి ఓ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు.

2022 జూలై 1న అచ్చెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామనే నకిలీ లేఖను విడుదల చేశారని..2022 జూన్ 29, 30 తేదీల్లో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేశారంటూ నకిలీ లేఖను సర్క్యులేట్‌ చేశారనే నెపంతో ఇద్దరు అమాయకులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహించారు. వారిపై కస్టోడియల్ హింసకు పాల్పడటమే కాకుండా వారిని కరడుగట్టిన నేరస్థులుగా ముద్రవేసేందుకు అన్ని మార్గాలను ఉపయోగించారని.. అచ్చెన్నాయుడు పేరుతో విడుదల చేసిన నకిలీ లేఖల ఫోర్జరీ సైతం విజయమ్మ కేసు వలె భావించి చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నానని చెప్పారు. నేను గతంలో చేసిన ఫిర్యాదులకు, ప్రస్తుత ఫిర్యాదుకు సంబంధించి తీసుకున్న చర్యలు తెలియజేయాలని కోరుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news