భారత్ విమానయాన రంగంలోకి కొత్త ఎయిర్ లైన్స్.. ‘ఆకాశ ఎయిర్’

-

బిగ్‌బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్ ఝున్ వాలా మద్దతుతో భారత్ విమానయాన రంగంలోకి కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఆకాశ ఎయిర్’ అడుగుపెట్టబోతోంది. ఆకాశ ఎయిర్ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ నూతన ఎయిర్ లైన్స్ సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విమాన సర్వీసులకు అవసరమైన అనుమతులు మంజూరు చేసింది డీజీసీఏ. విమానాలు నడిపేందుకు అవసరమైన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏఓసీ)ని అందజేసిన నేపథ్యంలో, జులై నెలాఖరుకు ఆకాశ ఎయిర్ తొలి విమానం గాల్లోకి ఎగరనుంది.

Akasa Air reveals its symbol and tagline 'inspired by the sky' | Mint

ఆకాశ ఎయిర్ ప్రధానంగా చవకధరల విమానయాన సంస్థగా వినియోగదారుల ముందుకు రానుంది. భారత విమానయాన రంగ దిగ్గజం వినయ్ దూబే స్థాపించిన ఆకాశ ఎయిర్ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. త్వరలోనే మరో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను అందుకోనుంది. ఆకాశ ఎయిర్ కు సీఈఓగా వ్యవహరిస్తున్న వినయ్ దూబే తాజా పరిణామాలపై స్పందిస్తూ, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా ప్రస్థానం ప్రారంభిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news