లగడపాటిని మెచ్చుకోవాలి – కేటీఆర్

-

మా సర్వే ప్రకారం తెలంగాణా లో వచ్చే ఎన్నికల్లో 90కి పైగా సీట్లు గెలుస్తాం అన్నారు మంత్రి కేటీఆర్. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. బిజెపి, కాంగ్రెస్ అధ్యక్షులు కూడా టిఆర్ఎస్ గెలుస్తుంది అని ఒప్పుకున్నారని అన్నారు. టిఆర్ఎస్ రాష్ట్రమంతటా ఉందని, కాంగ్రెస్, బీజేపీలు అంతటా లేవని అన్నారు. కొన్నిచోట్ల షర్మిల కూడా ఉందని తెలిపారు. మొన్నటి సర్వే బిజెపి దని, నిన్నటి సర్వే కాంగ్రెస్ ది అని.. కానీ రెండు సర్వేలు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలిచాక గడ్డం తీసుకుంటానన్న వారు ఇప్పుడు రంగు వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాజకీయ సన్యాసం అన్నాడని.. దీన్ని బట్టి చూస్తే లగడపాటిని మెచ్చుకోవాలి అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత కూడా సర్వేలు కెసిఆర్ మళ్లీ గెలుస్తాడు అని చెబుతున్నాయి అన్నారు. దక్షిణ భారతదేశంలో హైట్రిక్ విజయం సాధించిన మొదటి సీఎం కేసీఆర్ అవుతాడు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news