లెక్క చూసుకో జగన్ రెడ్డి… నాలుగంటే నాలుగే : చంద్రబాబు

-

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత వారం ఏపీలో భారీ వర్షాలకు వంద‌లాది ప‌ల్లెలు నీట మునిగాయి. దీంతో.. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్ర‌భుత్వం ముంపు బాధితుల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తోంది. ఇలా వైసీపీ స‌ర్కారు ముంపు బాధితుల‌కు అందించిన వ‌ర‌ద సాయం ఇదేనంటూ చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా మంగ‌ళ‌వారం ఓ ఫొటోను పంచుకున్నారు. నాలుగంటే… నాలుగేనంటూ ఆయ‌న స‌ద‌రు పోస్ట్‌కు కామెంట్ జ‌త చేశారు చంద్ర‌బాబు.

Former CM Chandrababu Naidu test positive for Covid-19- The New Indian  Express

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌ర్కారు అంద‌జేసిన వ‌ర‌ద సాయం నిత్యావసరాల‌ను ఓ చేట‌లో పెట్టిన ఫొటోను చంద్ర‌బాబు త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. అందులో నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు మాత్ర‌మే ఉన్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం…. లెక్క చూసుకో జగన్ రెడ్డి… నాలుగంటే నాలుగే! అంటూ ఓ సెటైర్ సంధించారు చంద్ర‌బాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news