జూలై 1 నుంచి అన్ని సేవలలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే…కాగా, తాజాగా నిన్నటి నుంచి కొన్ని వస్తువుల పై పన్ను అమలు అయిన విషయం తెలిసిందే..ఈ మేరకు పప్పు, పిండి, బియ్యం, పెరుగు మరియు లస్సీ వంటి నిత్యావసర వస్తువుల ధరలు, బ్రాండెడ్ మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై GST విధించబడుతుంది..
మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ 14 వస్తువులను బహిరంగంగా అంటే లూజ్ గా కొనుగోలు చేస్తే పన్నువిధించబడదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి ఈ 14 వస్తువుల జాబితాను జత చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని నిర్మలా సీతారామన్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు..
ఆ ఉత్పత్తులను ఫ్యాక్ చేసి లేబుల్ వేసి విక్రయిస్తే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని వెల్లించారు. తాజా నిబంధనల ప్రకారం.. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని స్పష్టం చేశారు..
#GST @FinMinIndia @PIB_India @PIBMumbai @PIBChandigarh @PIBHyderabad @pibchennai @PIBKolkata @PIBKohima @PIBGuwahati @PIBHindi @cbic_india https://t.co/EDWfuYnGzC
— Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022
గుడ్ న్యూస్.. ఆ వస్తువుల పై జీఎస్టీ లేదట.. ఇదిగో ప్రూఫ్..
-