దొంగ ఓట్లతో గెలవడం కూడా ఓ గెలుపెనా?- నారా లోకేష్

-

నేడు తిరుపతికి కో -ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 12 మంది డైరెక్టర్లకు వైసీపీ – టీడీపీలు అభ్యర్థులను నిలబెట్టారు. అయితే టిడిపి నేతలను గృహనిర్బంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలు ఎందుకు అని మండిపడ్డారు నారా లోకేష్. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.” దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని టిడిపి నాయకులు పట్టుకుంటే వారిని వదిలేసి టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నిదర్శనం”.

” దొంగ ఓట్ల తో గెలిస్తే దొంగ అంటారు తప్ప నాయకుడు అనరు. టౌన్ బ్యాంకు ఎన్నికల్లో దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయించుకున్న వైసీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి. అరెస్టు చేసిన టిడిపి నాయకులను వెంటనే విడుదల చేయాలి”. ” రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అని ఉంది. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో జగన్ రెడ్డి దొంగ బ్రతుకు మరోసారి బయటపడింది. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? ఎన్నికల సమయంలో టిడిపి నాయకులను గృహనిర్బంధం చేసే హక్కు ఎవరిచ్చారు.” అది తీవ్రంగా మండిపడుతు లోకేష్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news