కింజరాపు ఫ్యామిలీలో ట్విస్ట్.. రామ్మోహన్ పట్టుబట్టారా?

-

ఎక్కడైనా రాజకీయాల్లో అంతర్గత రాజకీయం కూడా ఉంటుంది…అంటే రాజకీయంగా పార్టీలు పార్టీలు రాజకీయ యుద్ధం చేస్తాయి…వైసీపీ-టీడీపీల మధ్యే జరిగే పోరు లాంటిది..కానీ అంతర్గత రాజకీయం కూడా ఉంటుంది…అది ఒకే పార్టీలో నడిచే పోరు ఇప్పుడు ఏపీలో ఇటు వైసీపీలో, అటు టీడీపీలో కూడా అంతర్గత పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే పలు రాజకీయ ఫ్యామిలీల్లో కూడా అంతర్గత పోరు జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో కేశినేని ఫ్యామిలీలో రగడ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో టీడీపీకి మొదట నుంచి అండగా ఉంటున్న కింజరాపు ఫ్యామిలీలో కూడా అంతర్గత పోరు ఉందని కథనాలు వస్తున్నాయి. పైకి బాగానే ఉన్న బాబాయి-అబ్బాయి అయిన అచ్చెన్నాయుడు-రామ్మోహన్ నాయుడుల మధ్య కూడా చిన్నపాటి విభేదాలు ఉన్నాయని ప్రచారం నడుస్తుంది. అయితే ఇదంతా మీడియాలో వస్తున్న ప్రచారమే తప్ప…నిజంగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయో లేవో ఎవరికి క్లారిటీ లేదు.

మీడియా ప్రచారం ప్రకారం..నెక్స్ట్ ఎన్నికల్లో రామ్మోహన్..అసెంబ్లీలో పోటీ చేయాలని చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో రామ్మోహన్..శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి గెలిచారు..ఈ సారి ఆయన నర్సన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారట. అదే సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవాలనేది రామ్మోహన్ ప్లాన్ అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే తన ప్లాన్ చంద్రబాబుకు కూడా చెప్పారని అంటున్నారు. అయితే అచ్చెన్నాయుడు ఉండగా రామ్మోహన్ కు మంత్రి పదవి ఇవ్వడం కష్టమని, పైగా శ్రీకాకుళం పార్లమెంట్ లో రామ్మోహన్ ని మించిన బలమైన నేత లేరు..రామ్మోహన్ అసెంబ్లీకి వెళితే..పార్లమెంట్ స్థానంలో టీడీపీకి నష్టం ఉంటుంది.

ఇక వచ్చే ఎన్నికల్లో బాబాయ్-అబ్బాయ్ అసెంబ్లీకి పోటీ చేస్తే జిల్లాలో అంతర్గత పోరు పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదని ప్రచారం వస్తుంది. అయితే ఇదంతా ప్రచారం వరకే..వాస్తవ పరిస్తితులు ఏంటి అనేది క్లారిటీ లేదు. నిజంగా రామ్మోహన్..అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news