చిరంజీవి ‘ఇంద్ర’ను డైరెక్ట్ చేయబోనన్న బి.గోపాల్..తర్వాత ఏం జరిగిందంటే?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఇంద్ర’. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. చిన్నికృష్ణ ఈ చిత్రానికి కథ అందించగా, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు. యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం వహించారు. కాగా, తొలుత ఈ పిక్చర్ కు తాను దర్శకత్వం వహించబోనని దర్శకుడు బి.గోపాల్ పారిపోయారట. అలా జరగడం వెనుకున్న ఇంట్రెస్టింగ్ స్టోరి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాక్షన్ ప్లస్ యాక్షన్ రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో అప్పటికే బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించాయి. ఆ చిత్రాలకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. అవి బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మళ్లీ అటువంటి బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరిని తాను చిరంజీవితో చేస్తే విజయం సాధించొచ్చా? అనే అనుమానంతో బి.గోపాల్ భయపడ్డారట.

ఆ సందర్భంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ..బి.గోపాల్ ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన ఒప్పుకోలేదు. ఆ టైమ్ లో చిరంజీవి..బి.గోపాల్, చిన్ని కృష్ణను తీసుకుని తన వద్దకు రావాలని చెప్పారట.

స్టోరి విన్న తర్వాత చిరంజీవి..అక్కడికే బి.గోపాల్ ను పిలిపించుకుని సినిమా చేయాలని చెప్పడంతో చివరకు బి.గోపాల్ ఒప్పుకున్నారు. అలా ఆ సినిమాకు ఆయన దర్శకత్వం వహించగా, అది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను ప్రజల మనసుల్లో సుస్థిరం చేసిన పిక్చర్ గా ‘ఇంద్ర’ నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news