బీజేపీ అసలు టార్గెట్ నేను కాదు.. కేసీఆరే వాళ్ల టార్గెట్ : ఎమ్మెల్సీ కవిత

-

తెలంగాణలో రాజకీయం టీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీలా మారింది. అయితే.. జాతీయ రాజకీయాల్లోకి సైతం ప్రవేశిస్తున్నట్లు కేసీఆర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత హస్తం ఉన్నట్లు బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ నేతలు భగ్గుమన్నారు. అయితే.. తాజాగా టీఆర్ఎస్ అగ్రనేత, ఎమ్మెల్సీ కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణంలో బీజేపీ తన పేరు లాగడాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని, కేసీఆరే వాళ్ల టార్గెట్అ ని అన్నారు. కేసీఆర్‌తో తమకు ముప్పు తప్పదని బీజేపీ గ్రహించిందని, అందుకనే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఉసి గొల్పుతోందని అన్నారు. తన తండ్రిని చూస్తే ప్రధాని మోదీకి టెన్షన్ అని, అందుకే ఇలాంటి పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీవి అన్నీ బ్యాక్ డోర్ డోర్ పాలిటిక్స్ అని విమర్శించారు.

Delhi liquor scam: Kavitha responds to allegations by BJP, says will  cooperate in probe

యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని, బీజేపీ కూడా ఇప్పుడు అదే చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ విషయం అర్థమైతే చాలని అన్నారు. లిక్కర్ స్కామ్‌ విషయంలో తనపై వచ్చిన ఆరోపణల గురించి పట్టించుకోవద్దని కుటుంబ సభ్యులకు చెప్పానని, తన తండ్రికి కూడా అదే చెప్పానని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని కవిత అన్నారు. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని సవాలు చేశారు. గిట్టని పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం బీజేపీకి కొత్తకాదని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తున్నది అదేనని ఆరోపించారు. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టారని, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ ఎంపీలపై కేసులు పెట్టి జైల్లో ఉంచారని పేర్కొన్నారు. భారతదేశం ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందని వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news