రాష్ట్రంలో సర్కార్​ బడుల కంటే బెల్టు షాపులే ఎక్కువ : వైఎస్‌ షర్మిల

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో దరిద్రపు పాలన నడుస్తోందని, ఎనిమిదేండ్లుగా బూటకపు హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన మోసగాడు సీఎం కేసీఆర్​ ఫైర్ అయ్యారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమె సాయంత్రం కొల్లాపూర్​ పట్టణానికి చేరుకుని.. అక్కడ సభలో మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య బూటకమేనని, రాష్ట్రంలో సర్కార్​ బడుల కంటే బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల . మద్యం అమ్మకాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్​వన్​గా ఉందని, ఇదే కేసీఆర్​ మార్క్ సంక్షేమమని ఆమె ఎద్దేవా చేశారు. సీఎం ప్రకటించిన పథకాలు, ఇచ్చిన హామీలు అన్నీ మోసమేనని వైఎస్‌ షర్మిల అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు వైఎస్‌ షర్మిల.

Khammam: రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్న- షర్మిల | YS Sharmila speech at  Khammam Sankalpa Sabha

సింగోటం–- గోపాల దిన్నె లింక్ కెనాల్ పనులు ఎందుకు ప్రారంభించలేదని షర్మిల నిలదీశారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మోసం చేశారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్​ది అయితే, దానిని మేయింటేన్ చేసే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. వైఎస్ హయాంలో కేఎల్ఐ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని, సింగోటం జాతరప్పుడు కృష్ణానదిలో బోటు మునిగి 60 మంది చనిపోతే ఆయన కొల్లాపూర్ వచ్చి సమీక్షించారని షర్మిల గుర్తుచేశారు వైఎస్‌ షర్మిల . ఫాంహౌస్ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను కలుస్తారు కానీ, కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి పోయేందుకు మనసు రాలేదని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Latest news