కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి పెట్రోల్ బంకుల్లో పీయూసీ సర్టిఫికేట్ ని కచ్చితంగా చూపించాలి. లేదంటే పెట్రోల్, డీజిల్ ఇవ్వరు. వాహనాల వలన కాలుష్యం ఎక్కువగా ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే కాలుష్యం లేకుండా చెయ్యాలని కృషి చేస్తోంది. ఇప్పుడు వెహికిల్‌కు పీయూసీ సర్టిఫికేట్ ని కచ్చితంగా చూపించాలని చెప్పింది. లేదంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొట్టదని చెప్పేసింది. ఈ నెల 25 నుంచే ఈ రూల్స్ అమల్లోకి తెస్తున్నట్టు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. జూలై 2022 నాటికి సరైన సర్టిఫికేట్ లేకుండానే 17 లక్షలకు పైగా వాహనాలు ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్నాయన్నారు.
అయితే సరైన పీయూసీ సర్టిఫికేట్ లేకుండా పట్టుబడితే మాత్రం సమస్యే అని అన్నారు. వెహికిల్ ఓనర్లకు ఆరు నెలల పాటు జైలు శిక్ష కానీ రూ.10 వేల వరకు జరిమానా కానీ ఉంటుందన్నారు. శీతాకాలంలో కాలుష్య స్థాయిలను నియంత్రించేందుకు అరవింద్ క్రేజీవాల్ ప్రభుత్వం వివిధ ప్లాన్స్ ని తీసుకొస్తూనే వున్నారు. అలానే సోమవారం నుంచి 24X7 వార్ రూమ్‌ను కూడా ఢిల్లీ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది.
15 పాయింట్ వింటర్ యాక్షన్ ప్లాన్‌ను తెచ్చారు. దీనిని పూర్తి చెయ్యాలని కృషి చేస్తున్నారు. గతంలో చూస్తే… ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం. దీని మూలంగా ఏమైందంటే.. గత నాలుగేళ్లలో దేశ రాజధానిలో గాలి కాలుష్య స్థాయిలు 18.6 శాతం తగ్గాయి.