బాల‌య్య‌, తార‌క్ మ‌ధ్య‌లో జ‌గ‌న్ !

-

న‌ట సింహ బాల‌కృష్ణ‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య‌లో ఏపీ సిఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జాయిన్ కానున్నారా? ముగ్గురు ఒకే వేదిక‌ను పంచుకోను న్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. లోప‌ల ఎన్ని ఉన్నా అప్పుడ‌ప్పుడు క‌ల‌వ‌క త‌ప్ప‌దు. ఇప్పుడు అలాంటి స‌న్నివేశ‌మే జ‌గ‌న్మోహాన్ రెడ్డికి ఎదుర‌వ్వ‌బోతుంది. అవిభాజిత ఆంద్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డిన త‌ర్వాత నంది అవార్డులు ప్ర‌దానోత్స‌వం జ‌ర‌గ‌లేదు. 2014,2015,2016,2017 కు సంబంధించిన నంది అవార్డుల‌ను ఇప్ప‌టికి అందించ‌ని సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం తొలి మూడు సంవ‌త్స‌రాలకు అవార్డుల‌ను ప్ర‌క‌టిం చిందిగానీ..ఇప్ప‌టివ‌ర‌కూ వాటిని ప్ర‌దానం చేయ‌లేదు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌క‌టించింది వ‌దిలేసారు.

CM YS Jagan with Jr.NTR and Balakrishna in an Event

త‌ర్వాత వీటిని ప‌ట్టించుకున్న నాధుడే లేడు. అయితే ఏపీకి నూత‌న ముఖ్య‌మంత్రి గా ఎన్నికైన జ‌గ‌న్ ఇప్పుడు నంది అవార్డ‌ల ప్ర‌ధానం పై దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. పెండింగ్ లో ప‌నుల్లాగే అవార్డుల‌ సంగ‌తి కూడా చూడండ‌ని జ్యూరీ క‌మిటీ కి ఆదేశాలిచ్చారుట‌. వీలైనంతగా త్వ‌ర‌గా అవార్డుల‌ను ప్ర‌క‌టించిన వారందరికీ బ‌హుక‌రించాల‌ని సూచించారుట‌. అదే జ‌రిగితే బాల‌య్య‌, ఎన్టీఆర్ మ‌ధ్య‌లోకి జ‌గ‌న్ రాక త‌ప్ప‌దు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం కాబ‌ట్టి క‌చ్చితంగా హాజ‌రు కావాలి. 2014 ఏడాదికి గాను ఉత్త‌మ న‌టుడిగా (లెజెండ్) బాల‌య్య ఎంపిక‌య్యారు. 2015 కిగాను మ‌హేష్ బాబు( శ్రీమంతుడు). 2016 కిగాను (జ‌న‌తా గ్యారేజ్) జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంపిక‌య్యారు.

కాబ‌ట్టి ప్ర‌ముఖులంద‌రికీ జ‌గ‌న్ చేతుల మీదుగానే అవార్డులు బ‌హుక‌రించాల్సి ఉంటుంది. ఇక బాల‌య్య కి జ‌గ‌న్ అభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. పార్టీల ప‌రంగా వేరైనా..ఎన్ని మాట‌లు అనుకున్నా! హీరోపై అభిమానం మాత్రం చెర‌గ‌న‌ది. బాల‌య్య‌-జ‌గ‌న్ కలిసిన‌ సంద‌ర్భాలు కూడా పెద్ద గా లేవు . కాబ‌ట్టి నంది అవార్డుల వేడుక‌ల్లో ఈ ద్యయం క‌లిసే అవకాశం ఉంది. జ‌గ‌న్ అభిమానులు…బాల‌య్య అభిమానులు థ్రిల్ ఫీల‌య్యే ఛాన్సెస్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news