Sourav Ganguly: మళ్లీ ‘క్యాబ్’ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ

-

Sourav Ganguly : ‘క్యాబ్’ అధ్యక్ష పదవీపై సౌరవ్ గంగూలీ కన్నేసారు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరో మారు కొనసాగాలని భావించి కుదరకపోవడంతో నిష్క్రమించిన నిష్క్రమిస్తున్న సౌరవ్ గంగూలీ అనూహ్యంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ క్యాబ్ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఐపీఎల్ చైర్మన్ గా పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించిన గంగూలీ, క్యాబ్ అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించాడు. బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి ముందు 2015-2019 మధ్య క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ మరో మారు ‘క్యాబ్’ అధ్యక్ష పీఠంపై కన్నేశాడు.

ఈ సందర్భంగా ‘దాదా’ మాట్లాడుతూ, “అవును క్యాబ్ అధ్యక్ష బరిలో నిలుస్తున్న” అని పేర్కొన్నారు. ఈనెల 22న నామినేషన్ వేయబోతున్నట్టు చెప్పారు. ఐదేళ్లపాటు తాను క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశారని, లోధా నిబంధనల ప్రకారం మరో నాలుగు ఏళ్ళు అధ్యక్షుడిగా కొనసాగవచ్చని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news