మాట తప్పిన బాలయ్య.. అసలు కారణం ఇదే..!

-

స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ తన సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నారో.. రాజకీయ విషయంలో కూడా అంతే బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇటీవల బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉండగా ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ రెండవ సీజన్ లో బిజీ గా ఉన్నారు. ఈరెండవ ఎపిసోడ్కి యంగ్ హీరోలైన విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ అతిధులుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ తల్లి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ వయసు చిన్నదని.. ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు అని, ఇంత చిన్న వయసులో దర్శకుడిగా, హీరోగా , నిర్మాతగా చేయడం అంటే వయసుకు మించిన భారం మోస్తున్నాడని అనిపిస్తోంది అంటూ ఆయన తల్లి వివరించింది.

అలాగే విశ్వక్ సేన్ తండ్రి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ నూటికి నూరు శాతం తాను చెప్పిందే కరెక్ట్ అవుతుందని అనుకుంటాడు అని వెల్లడించారు. నేను ఎంత చెప్పినా వినడని.. ఒక్కోసారి నన్ను కూడా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుందని ఆయన తండ్రి వివరించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తల్లిదండ్రులతో ఉండడానికి కూడా సమయం దొరకడం లేదని కామెంట్లు చేశారు. 2023 జనవరి నుంచి నెలలో పది రోజులు ఇంటికి కేటాయిస్తానని కూడా తెలిపారు. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను కూడా నా భార్య వసుంధరకు ఎన్నో ఒట్లు వేశాను. ప్రతి ఆదివారం నేను పని చేయనని చెబుతానని.. కానీ ఆ మాటను నిలబెట్టుకోనని కామెంట్లు చేశారు.

Nandamuri Balakrishna's wife Vasundhara caught with Rs 10 lakh of old notes at Renigunta airport - IBTimes India

ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య 107వ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news