సీఎం జగన్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించిన గోరంట్ల బుచ్చయ్య

-

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దీపావళి సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెటైర్లు సంధించారు. దీపావళి వేడుకల్లో వినియోగించే టపాసుల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన మంగళవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా చతురోక్తులతో కూడిన వ్యాఖ్యలు చేశారు గోరంట్ల బుచ్చయ్య.

Butchaiah Chowdary reveals why Pawan didn't support TDP

సీఎం జగన్ ను ‘సీమ’ టపాకాయ్ అనుకుంటే… ఆయన ‘చీమ’ టపాకాయ్ అయ్యారని బుచ్చయ్య చౌదరి అన్నారు. తాటాకు టపాకాయ్ మాదిరిగా తుక్కు ఎక్కువ సౌండ్ తక్కువలాగా పాలన ఉందని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక మంత్రులు, వైసీపీ నేతలు తారాజువ్వలాగాపైకి వెళ్లి కింద పడటం అలవాటుగా మారిపోయారన్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రస్తావించిన బుచ్చయ్య.. పేటీఎం కూలీల పరిస్థితి అయితే వెలగని మతాబుల లాగా ఉన్నారంటూ ఆయన సెటైర్లు విసిరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news