సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : మోడీ

-

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం చేరుకున్నారు భారత ప్రధాని మోడీ. అనంతరం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. తరువాత బహిరంగ సభలో మోడీ తెలుగులో స్పీచ్ మొదలు పెట్టారు. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో 70 నియోజకవర్గాల్లోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. వారందరికీ స్వాగతం అంటూ అభినందనలు తెలిపారు మోడీ. రామగుండం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇప్పుడు జాతికి అంకితం చేశామన్నారు మోడీ. లక్ష్యాలు పెద్దగా ఉన్నప్పుడు సరికొత్త పద్ధతులను అవలంబించాలని మోడీ అన్నారు. కొత్త వ్యవస్థను రూపొందించాలని.. దేశ ఫర్టిలైజర్ రంగం దీనికి ఒక ఉదాహరణ అని మోడీ చెప్పారు. మన దేశం ఎరువుల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడిందని.. యూరియా కోసం ఉన్న పరిశ్రమల్లో టెక్నాలజీ పాతవి అవ్వడం వల్ల మూతపడ్డాయన్నారు మోడీ.

 

With right support and environment, no goal is impossible: PM Modi

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అందులో ఒకటి రామగుండం అని చెప్పారు. ఖరీదైన యూరియా విదేశాల నుంచి వచ్చినా రైతులకు చేరకుండా అక్రమ పరిశ్రమలకు దొంగతనంగా చేరవేశారన్నారు. దానివల్ల రైతులు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేదన్నారు మోడీ. 2014లో 100 శాతం అక్రమ రవాణాను కేంద్ర ప్రభుత్వం ఆపగల్గిందన్నారు మోడీ. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోందని… మరోవైపు యుద్ధాలు, మిలటరీ యాక్షన్స్ ప్రభావం కూడా ప్రపంచం, మన దేశంపైనా పడుతోందన్నారు మోడీ. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితలు మధ్య కూడా ఇంకో విషయం ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. భారత్ త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుందని నిపుణులు అంటున్నారని మోడీ చెప్పారు. 1990 తర్వాత ఈ 30 ఏళ్లలో జరిగిన వృద్ధి ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే అవుతుందని నిపుణులు అంటున్నారని మోడీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news