సాయిరెడ్డి వర్సెస్ టీడీపీ..ఫోన్ దొంగతనంపై రచ్చ..!

-

ఏపీలో నేతలు రాజకీయ విమర్శలు దాటేసి..ఏకంగా బూతులు తిట్టుకునే వరకు వెళ్ళిన విషయం తెలిసిందే. బూతులు అంటే..అలాంటి..ఇలాంటి బూతులు కాదు..పచ్చి బూతులు. ఇక ఈ బూతుల పర్వం ఎవరు మొదలుపెట్టారనేది అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరు మొదలుపెట్టిన గాని..అన్నీ పార్టీలు ఇప్పుడు అదే తరహాలో ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు మరీ దారుణంగా ఉంది..నేతలు దారుణంగా తిట్టుకుంటున్నారు.

అయితే ప్రతిరోజూ ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..చంద్రబాబు, లోకేష్, రామోజీ రావు, ఇంకా ఇతర టీడీపీ నేతలని టార్గెట్ చేసి పచ్చి బూతులు తిడుతున్నారు. ఇటు విజయసాయిని సైతం టార్గెట్ చేసి టీడీపీ నేతలు అదే స్థాయిలో తిడుతున్నారు. ఇక తాజాగా విజయసాయి రెడ్డి ఫోన్ పోయిందని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయసాయి బంధువు శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేయడంతో సాయిరెడ్డి కూడా తనని అరెస్ట్ చేస్తారేమో అని భయపడి.. ఫోన్ దాచేసుకుని పోయిందని నాటకాలు వేస్తున్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఇదే క్రమంలో..విజయ సాయి ఫోన్ ఎలా పోయింది? (ఏ) కృష్ణా నదిలో విసిరేశారు (బి) రుషికొండ తవ్వకాల్లో పడేశారు (సి) తాడేపల్లి ప్యాలెస్ లాగేసుకుని దాచేసింది (డి) చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లోనే ఉంది. అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. దీనికి కౌంటరుగా విజయసాయి.. చంద్రం చిప్ ఎలా దొబ్బింది? (ఏ) మాధవ రెడ్డి ఫాంహౌజ్ లో ఉంది. (బీ) బోకేష్ దొబ్బేశాడు. (సీ) టీడీపీ చిల్లర దొంగలు కాజేశారు. (డీ) అమరావతి రియల్ ఎస్టేట్ భూముల్లో పాతేశాడు. అంటూ తనదైన శైలిలో రివర్స్ ఎటాక్ చేశారు.

అలాగే లోకేష్..మంగళగిరిలో పిల్లలతో సెల్ఫీ తీసుకునేటప్పుడు..ఫోన్ తలకిందులు చేశారు..దీంతో ఇదేంటి బొకేష్ ఫోన్ తలకిందులు చేయాల్సిన అవసరం లేదని, ఫోన్ ఎత్తులో ఉంటే బుడ్డోడు ఎలా పడతాడని సెటైర్ వేశారు. దీనికి టీడీపీ సీనియర్ అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇస్తూ.. ఒరేయ్ తింగరి సాయి రెడ్డి..ఫోన్ ఎటు తిప్పినా, ఒకటే బొమ్మ వస్తుందిరా…అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా నేతలు దారుణంగా తిట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news