ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సస్‌కు ఎలుకలు కారణం అని మీకు తెలుసా..?

-

ప్యారాచూట్‌ ఆయిల్‌ గురించి పరిచయం అక్కర్లా…మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం.. ఈ ఆయిల్‌ తర్వాత ఎన్నో ఆయిల్స్‌ వచ్చాయి కానీ.. ఏ ఆయిల్‌లో కూడా ప్యారాచూట్‌ ఆయిల్‌లో ఉన్న ప్యూర్‌ కోకోనట్‌ ఆయిల్‌ లేదు. ఇదే విషయాన్ని ఎంతో మంది నిపుణులు సైతం చెప్పారు. హెయిర్‌ బాగా ఉన్నవాళ్లను అడగండి.. స్పెషల్‌గా ఏం ఆయిల్‌ వాడను..ప్యారాచూట్‌ ఆయిలే అంటారు. ఈ హెయిర్‌ ఆయిల్‌ ఇంతలా సక్సెస్‌ కావడానికి కారణం ఎవరో తెలుసా.? ఎలుకలు.. ఎంటీ ఎలుకలా.. కొంపతీసి ఎలుకలతో ఏమైనా ఆయిల్‌ చేశారా అని డౌట్‌ వస్తుందా..? అలా కాదు.. అసలు కథేంటో మీరు చదవేయండి..!!
1980లో ప్యారాచూట్‌ ఆయిల్‌ని టిన్‌ క్యాన్స్‌లో సప్లై చేసేవాళ్లు. ఈ టిన్‌ క్యాన్స్‌కు ముందు చదరపు ఆకారంలో ఉండే ప్లాస్టిక్‌ డబ్బాల్లోనే సప్లై చేసేవాళ్లు. కానీ ఇదే సమయంలో సేల్స్‌ కోసం ఉంచిన ప్లాస్టిక్‌ క్యాన్స్‌ను నాశనం చేసి వాటిని కిందపడేసివి ఎలుకలు. ఇలా తరుచూ నూనె మొత్తం నేల పాలైపోవడంతో ప్యారాచూట్‌ సంస్థకు చాలా నష్టం వాటిల్లిందట… ఆ తర్వాత టిన్‌ క్యాన్స్‌లో ఆయిల్‌ సప్లై చేయడం ప్రారంభించారు. అయితే ఈ టిన్‌ క్యాన్స్‌కు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుండటంతో మళ్లీ ప్లాస్టిక్‌ బాటిల్‌తో సేల్స్‌ ప్రారంభించారు. వాటర్‌ బాటిల్‌ షేప్‌తో పాటు చిన్న సైజ్‌లో సప్లై ప్రారంభించింది ప్యారాచూట్‌ సంస్థ. అయితే మొదట్లో ఉన్న ప్లాస్టిక్‌ క్యాన్స్‌ను పట్టుకునేందుకు ఎలుకలకు ఎక్కువగా గ్రిప్‌ ఉండేది. కానీ ఇప్పుడు వాటర్‌ బాటిల్‌ మోడల్లో ఉండటంతో ఎలుకలు వీటిపైకి ఎక్కేందుకు సాధ్యపడలేదు… దీంతో సక్సెస్‌ ఫుల్‌గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే డిజైన్‌ను కంటిన్యూ చేస్తూ వస్తోంది ప్యారాచూట్‌ సంస్థ.
 బ్రాండ్ సక్సెస్ కావాలంటే ప్యాకింగ్ పద్ధతి కీలకం.. తాము ఎనభై దశకంలో ఈ వ్యాపారంలో ప్రవేశించినప్పుడు నూనెను డబ్బాల్లో అమ్మేవారని మారికో వ్యవస్థాపకుడు హర్ష్ మారివాలా చెప్పారు. రేకు కంటే ప్లాస్టిక్ చవక అని, డబ్బాల నుండి ప్లాస్టిక్ లోకి ప్యాక్ చేయాలనుకున్నారు. సాధారణంగా కంపెనీలు మార్కెట్లో ఒక ఉత్పత్తిని ప్రవేశ పెట్టె ముందు, లోతుగా అధ్యయనం చేసి కొబ్బరినూనెకు ప్లాస్టిక్ పాకింగ్‌లో విజయవంతం కాదు అని తేల్చిందట… నాలుగు పలకల ఆకారంలో సీసాలను తయారు చేశారు. ఆ పని సరిగా చెయ్యకపోవటం వల్ల నూనె కారిపోయేది. ఎలుకలు వాటిని నాశనం చేసేవి. ఫైనల్‌గా ఖర్చు తక్కువ అయిన ప్లాస్టిక్ డబ్బాల్లో గుండ్రని ఆకారంలో ప్యాకింగ్ చేసి సక్సెస్ సాధించామని మారివాలా తెలిపారు. సో..అలా ఎలుకల పారాచూట్‌ ఆయిల్‌ సక్సస్‌కు కారణం అయ్యాయి..!!

Read more RELATED
Recommended to you

Latest news