కవిత సీబీఐ విచారణ లైవ్ పెట్టాలి : అద్దంకి దయాకర్

-

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు గత 7 గంటలుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ కవితపై జరుగుతోన్న సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఓపెన్ గా విచారణ జరిగితేనే ప్రజలందరికి నిజాలు తెలుస్తాయన్నారు దయాకర్. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. గతంలో కవిత ముద్దాయి అన్నారు.. ఇప్పుడు సాక్షిగా విచారణ చేయడం వెనక సిక్రెట్ ఏంటని ఆయన ప్రశ్నించారు దయాకర్. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. ఇవాళ ఉదయం 11 నుంచి ఎమ్మెల్సీ కవిత స్టేట్ మెంట్ సీబీఐ అధికారులు రికార్డు చేస్తున్నారు. మహిళా అధికారులతో కూడిన సీబీఐ టీమ్.. ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Addanki Dayakar Big Shock to T Congress కాంగ్రెస్‌కు షాకివ్వనున్న అద్దంకి  ద‌యాక‌ర్..? — Great Telangaana

160 CRPC కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు.. కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. వీడియో రికార్డింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. సీబీఐ కవితకు నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. లీగల్ ఎక్స్ పర్ట్స్ సమక్షంలో స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news