ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. కొన్ని సరదాగా అనిపిస్తే మరికొన్ని మాత్రం షాక్ కు గురిచేస్తున్నాయి.. అందులో కొన్ని వీడియోలు మాత్రం సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.. ఇలాంటి వీడియోలు నిత్యం ఎన్నో వైరల్ అవుథున్నాయి… తాజాగా మరో వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఇక విషయానికొస్తే.. ఆకస్మాతు గా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు పిల్లల ను ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. అతను చేసిన పని ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాడు.. వరదల ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.. ఏ ప్రమాదం జరగలేదు.. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని అనుకున్నారు. కానీ ఓ సాధరణ వ్యక్తి అని తెలిశాక అభినందించారు.
పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటో గ్రాఫర్ గా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. క్షణం ఆలస్యం అయిన అతని ప్రాణాలు పొయ్యెవి అయిన అతను వెనకడుగు వెయ్యలేదు.. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు.. ఇలాంటి సమయాల్లో ఇలా ధైర్యం చెయ్యాలాంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది…
He is a hero! 💞pic.twitter.com/wKcUKVQpmH
— Figen (@TheFigen_) December 21, 2022