Breaking : దళితులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..

-

దళితుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలో దళితుల కోసం ప్రత్యేక శ్మశాన వాటిక నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు దళితులు ఉన్న ప్రతి గ్రామంలో తగిన భూమిని గుర్తించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల జనాభాను బట్టి అర ఎకరం నుంచి, ఎకరం స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, దళితులు ఉన్న ప్రతి గ్రామంలో తగిన భూమిని గుర్తించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు.

Andhra CM YS Jagan urges Union health minister to sanction medical colleges in 12 districts - India Today

గ్రామంలోని దళితుల జనాభాను బట్టి అర ఎకరం నుంచి, ఎకరం స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు లేకపోతే గ్రామంలోని రైతుల నుంచి భూమిని సేకరించి, వారికి వేరే చోట భూమిని ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అన్నీ పూర్తయిన తర్వాత శ్మశానవాటికలను లాంఛనంగా ప్రారంభించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news