Breaking : పోలీస్‌ ఉద్యోగాల గర్భిణులకు శుభవార్త.. ఈవెంట్స్‌ మినహాయింపు

-

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు గర్భిణీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫిజిక‌ల్ ఈవెంట్స్ నుంచి గ‌ర్భిణుల‌కు మిన‌హాయింపు ఇచ్చారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హ‌త సాధించిన వారిలో ప‌లువురు మ‌హిళ‌లు గ‌ర్భిణులుగా ఉండ‌టంతో ఫిజిక‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌రు కాలేక‌పోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొన‌కుండానే మెయిన్స్ రాసేలా వెసులుబాటు క‌ల్పించారు.

Telangana Police Recruitment 2022: Registration Begins For 16,614 Posts  From May 2, Check Notification on tslprb.in

మెయిన్స్‌లో ఒక వేళ పాసైతే.. నెల రోజుల్లోపు ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేర‌కు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అధికారుల నియమావ‌ళిని అంగీక‌రిస్తూ గ‌ర్భిణులు లేఖ రాసివ్వాల‌ని నిబంధ‌న విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news