పార్లమెంటు ప్రాంగణంలో తియ్యని హల్వా తయారుచేసిన ఆర్థికమంత్రి నిర్మలా

-

కేంద్ర బడ్జెట్ ప్రకటన ముంగిట పార్లమెంటులో ఆర్థికమంత్రి హల్వా తయారుచేయడం ఆనవాయతీ అని తెలిసిందే. ఓ సంప్రదాయంగా వస్తున్న ఈ కార్య్రమాన్ని ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆచరించారు. పార్లమెంటు ప్రాంగణంలో హల్వా తయారుచేసిన నిర్మల అందరికీ వడ్డించారు. ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగ్వత్ కిసాన్ రావు కరాద్ లకు, ఆర్థిఖ శాఖ అధికారులకు, పార్లమెంటు నార్త్ బ్లాక్ లోని ఇతర మంత్రిత్వ శాఖల అధికారులకు తియ్యని హల్వా తినిపించారు. నిర్మలా సీతారామన్ పెద్ద బాండీలో హల్వాను గరిటెతో తిప్పుతూ ఈ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. మనం చేపట్టిన పని విజయవంతంగా పూర్తయితే ఆనందపడతాం. ఆ సంతోషాన్ని వివిధ రకాలుగా పంచుకుంటాం. అందులో భాగంగానే నోరు తీపి చేసుకుంటాం. అలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సంబంధించి కూడా హల్వా కార్యక్రమం జరుగుతుంటుంది. బడ్జెట్‌ రూపకల్పన అనంతరం శుభానికి సూచికగా ఈ మిఠాయిని సిద్ధం చేస్తుంటారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా ఈ హల్వాను తయారు చేయడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. కేంద్ర బడ్జెట్ తయారీలో చివరి ఘట్టం అయిన హల్వా వేడుక నార్త్ బ్లాక్‌లో ఘనంగా జరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news