దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కారణం..మన తినే ఆహారం.. ఆహారంలో మనం వాడే ఆయిల్.. మీరు ఎలాంటి ఆయిల్ వాడుతున్నారో దాన్ని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి.. మరి అన్ని రకాల్లో ఏది మంచిదో తెలుసుకోవడం చాలా కష్టం. కింద తెలిపిన నూనెలను వాడితే దాంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.! రోజూ వాడే నూనెలకు బదులుగా నువ్వుల నూనెను వాడవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో ఈ నూనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతో శరీరాన్ని మర్దనా చేస్తుంటారు. ఈ నూనె వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. కనుక దీన్ని రోజూ వాడితే మంచిది.
ఆలివ్ ఆయిల్ ఖరీదైందే. కానీ దీన్ని తరచూ వాడడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా విటమిన్ ఇ లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె సురక్షితంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.కొబ్బరినూనె కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. వాపుల నుంచి బయట పడేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.
అవకాడో ఆయిల్ కూడా మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా ఈ నూనె పనిచేస్తుంది. కణాలు దెబ్బతినకుండా సురక్షితంగా ఉంటాయి. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టం నివారించబడుతుంది.పొద్దు తిరుగుడు నూనె కూడా మనకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులను వాపులను, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి ఈ నూనె మేలు చేస్తుంది.
ఆవ నూనెను కూడా వంటల్లో ఉపయోగించవచ్చు. వీటిల్లో ఉండే పోషకాలు మనకు అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
ఈ ఆయిల్స్ అసలు వద్దు..
పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఆల్గే ఆయిల్, అవిసె నూనె, డాల్డా వంటి నూనెలను వాడరాదు. వీటితో హాని కలుగుతుంది.