ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్బిఐ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..లోన్ తీసుకొనేవారికి ఇది తీయ్యని వార్త..ఎస్బిఐ బ్యాంకు లో ఎటువంటి ఋణం తీసుకుంటే ఎలా బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్ అందించింది. ప్రాసెసింగ్ చార్లీలు లేకుండానే హోమ్ లోన్ పొందొచ్చని వెల్లడించింది. ఎస్‌బీఐ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో బ్యాంక్ నుంచి హోమ్ లోన్ పొందాలని భావించే వారికి చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎస్‌బీఐ తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది..
ఈ బ్యాంకులో మీరు హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తే మాత్రం మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి..వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఇంకా ఎక్కువ వడ్డీకీ హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు వరుస పెట్టి రుణ రేట్లు పెంచుతున్న విషయం తెలిసిందే.. కానీ ఎస్బిఐ మాత్రం తగ్గించడం విశేషం..
బ్యాంక్ సోలార్ రూఫ్ టాప్ ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది. అలాగే ఎలాంటి హిడెన్ చార్జీలు ఉండవని బ్యాంక్ పేర్కొటోంది. ఎస్‌బీఐ టైఅప్ ప్రాజెక్టులకు అయితే కవేలం 5 రోజుల్లో లోన్ పొందొచ్చని ఎస్‌బీఐ తెలియజేసింది. హోమ్ లోన్ పొందాలని భావించే వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. కాగా రానున్న రోజుల్లో హోమ్ లోన్ వడ్డీ రేటు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును పెంచొచ్చని తెలుస్తోంది. ఎస్‌బీఐ హోమ్ లోన్ పొందాలని భావించే వారు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు..
Accomplish the goal of owning your dream home with SBI Home Loan.
To know more, visit: https://t.co/h4aFI1fmxE#SBI #HomeLoan #AmritMahotsav pic.twitter.com/2FPw9nrm2F— State Bank of India (@TheOfficialSBI) March 20, 2023