వైసీపీ టైటానికి షిప్, మునిగిపోవడానికి రెడీగా ఉంది – బుద్ధా వెంకన్న

-

వైసీపీ టైటానికి షిప్, మునిగిపోవడానికి రెడీగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. వల్లభనేని వంశీ, కోడాలినానీలు వైసీపీ తోనే భూ స్థాపితమని.. వాళ్ళు వస్తామన్నా ఏపార్టీ చేర్చుకోదని తేల్చి చెప్పారు. నిన్న సీఎం జగన్‌ సమావేశానికి వైసీపీలో అంతర్గత గ్రూప్ రాజకీయాలు కారణం అన్నారు….రేపు విశాఖలో చంద్రబాబు నిర్వహించేది విజయ శంఖారావం సభ అన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

అటు టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగల పూడి అనిత హాట్‌ కామెంట్స్ చేశారు. మద్యం మీద వస్తున్న ఆదాయంతోనే వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది…..కంపెనీలు, కమిషన్లు సీఎం, వైసీపీ వాళ్ళవేనని తెలిపారు. మద్యపాన నిషేధం విధిస్తామన్న ముఖ్యమంత్రి ఎందుకు ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించలేదు….?మద్యం విక్రయాలపై ప్రభుత్వం ఏటా 18 వేల కోట్లు వస్తోందన్నారు. విశ్వసనీయత గురించి గొప్పగా చెప్పుకునే సీఎం జగన్‌ ఎందుకు మధ్య నిషేధంపై వెనక్కి తగ్గారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news