వేసవికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేడి వాతావరణం కారణంగా చాలా మంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎండ వలన వడదెబ్బ మొదలు నీరసం వరకు చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కచ్చితంగా ఇలా చేయండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఇవి చాలా అవసరం ఆరోగ్య నిపుణులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి వాటి కోసం చూసేద్దాం.
వేసవిలో బయట ఆహారం అసలు తీసుకోకండి. బయట ఆహారం వేసవిలో తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి బయట ఫుడ్ కి దూరంగా ఉండండి.
నిద్ర విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సరైన నిద్ర లేకపోతే నీరసం వికారం తలనొప్పి ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. కాబట్టి నిద్రపోవడం లో కాంప్రమైజ్ అవ్వద్దు.
వేసవికాలంలో స్విమ్మింగ్ వంటివి చేయడం మంచిది. దీనివలన వ్యాయామం అవుతుంది పైగా రిఫ్రెష్ గా ఉంటారు. బయట వ్యాయామాలు చేయకండి. ఇంట్లోనే త్రెడ్ మిల్ యోగా వంటివి చేస్తూ ఉండండి. చల్లటి ప్రదేశంలో వ్యాయామం చేస్తూ ఉండండి.
వేసవికాలంలో కాటన్ దుస్తులు వేసుకోండి. అలానే బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్, గొడుగు వంటివి పట్టుకు వెళ్ళండి.
ఉదయం 11 గంటలలోగా మీ పనులుని పూర్తిచేసుకోండి సాయంత్రం ఐదు తర్వాతే బయటికి వెళ్ళండి.
వేసవి కాలంలో ఆల్కహాల్ కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండాలి వీటి వలన కూడా సమస్యలు కలుగుతాయి.
గుడ్లు, మాంసాన్ని వేసవికాలంలో తీసుకోకపోవడం మంచిది వీటిని తీసుకోవడం వలన మీకు మరింత వేడిగా అనిపిస్తుంది.
వేసవికాలంలో పండ్లుని కూరగాయలను ఎక్కువ తీసుకోండి పండ్ల రసాలని కూడా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లు వంటివి కూడా మీరు తీసుకోవచ్చు.
వేసవికాలంలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ మినరల్స్ అధికంగా పోషక పదార్థాలు ఉండే వాటిని తీసుకుంటూ ఉండండి.
వీటితో పాటుగా కంటే ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టండి. హానికరమైన యువి కిరణాలు కళ్ళని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. ఇలా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.