మీరు వస్తే ప్రభుత్వ సభాల ఉండేది : కిషన్‌ రెడ్డి

-

ఇవాళ్లి ప్రధాని మోడీ పర్యటనపై బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి పర్యటన విజయవంతం అయిందని, ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక రకమైన మేలు జరిగేలా అనేక ప్రాజెక్టులను అంకితం చేశారని, 11,500 కోట్ల ప్రాజెక్టులకు రైల్వే ,ఆరోగ్య, రహదారులు చేపట్టారని కిషన్‌ రెడ్డి అన్నారు. అంతేకాకుండా.. ‘ఉభయ రాష్టలకు మేలు జరిగేలా చేశారు. రాజమండ్రి టు హైదరాబాద్ రోడ్డు 56 కిలో మీటర్లు తగ్గుతుంది. గతంలో హైదరాబాద్ టూ విశాఖపట్నం ట్రైన్ ప్రారంభించారు. 14 వందే భారత్ ట్రైన్ ప్రారంబించారు తెలుగు రాష్టాలకు ఉపయోగ పడుతుంది. ముఖ్యమంత్రి కార్యక్రమానికి రాలేదు..ఆయనకు ఇంతకన్నా వేరే పని ఏముందో కెసిఆర్ ప్రజలకు చెప్పాలి. దేశంలో వంద వందే భారత్ ట్రైన్స్ ప్రారంభిస్తామని చెప్పారు. తలసాని అది తెలియకపోతే మేము ఏం చేయాలి.

TRS resorting to attacks out of fear of defeat: Kishan Reddy

 

తెలంగాణ మంత్రులు అందరూ జీరోనే.. కెసిఆర్ ఫౌమ్ హౌస్ నుంచి బయటకురారు…..ప్రజలను కలవరు.. కెసిఆర్ కి ఇంతకు మించిన పని ఏంటి..ఆయన ఎందుకు ప్రధాని సభకు రాలేదు. గతంలో ప్రధాన మంత్రి వస్తే రామగుండం రాలేదు. ఈరోజు 11500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తే కెసిఆర్ రాలేదు. తెలంగాణ ను ఎలా దోపిడీ చేయాలని కెసిఆర్ కుటుంబం చూస్తుంది. కొడుకు ను ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తప్ప ఏమి లేదు. మోడీ అనేక పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వచ్చారు,ముఖ్యమంత్రి కనీస సంప్రదాయాలు పాటించడం లేదు. తెలంగాణ సమాజం దీన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం లో ముఖ్యమంత్రి భాగస్వామ్యం కావాలి. కెసిఆర్ బాధ్యతారహితంగా వ్యవహరించారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధాన మంత్రికి కెసిఆర్ తో వైర్యం లేదు.. తెలంగాణ ప్రజలతో కెసిఆర్ కి వైర్యం ఉంది. మేము ప్రొటో కాల్ పాటించాము. చివరి నిమిషంలో సభలో కెసిఆర్ కి ఏర్పాటు చేసిన కుర్చీ తీసేశాము. మీరు వస్తే ప్రభుత్వ సభాల ఉండేది’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news