IPL 2023: ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై… ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ రోహిత్ !

-

గత రాత్రి ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్ మధ్యన అరుణ్ జైట్లీ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో ఫలితం ఆఖరి బంతి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ నిర్ణీత ఓవర్ లలో 172 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. వార్నర్ మరియు అక్షర పటేల్ లు అర్థ సెంచరీలు సాధించారు. ముంబై బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ చావ్లా మరియు బెహ్రేన్ డార్ప్ లో తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 173 పరుగుల టార్గెట్ లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఢిల్లీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని త్వరగా పడగొట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

కానీ రోహిత్ మరియు ఇషాన్ కిషన్ లు మొదటి వికెట్ కు 71 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్ మ్యాచ్ ను సురక్షిత స్థితిలో నిలిపి ఔట్ అయ్యాడు. ఆఖరి ఓవర్ లో 5 పరుగులు చేయాల్సిన సమయంలో డేవిడ్ మరియు గ్రీన్ లు నెమ్మదిగా సింగిల్స్ తీసుకుంటూ ఆఖరి బంతికి ముంబై కి విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో ఈ సీజన్ లో మూడు మ్యాచ్ లలో ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఇక ఈ మ్యాచ్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. కాగా ఢిల్లీ వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి అభిమానులను మరియు ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశపరిచింది.

Read more RELATED
Recommended to you

Latest news