మేడ్చల్‌లో మల్లారెడ్డికి సెగలు..సొంత నేతలే షాక్ ఇస్తారా?

-

తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడంలో గాని, కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ లకు భజన చేయడం లో గాని మల్లారెడ్డిని మించిన వారు లేరనే చెప్పాలి. అలా భజన చేసి మల్లారెడ్డి ఫేమస్ అయ్యారు. అయితే మంత్రిగా ప్రజలకు ఏ మేర పనులు చేస్తున్నారో తెలియదు గాని..కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ లకు మాత్రం భజన బాగా చేస్తారు.

ఇలా ఫేమస్ అయిన మల్లారెడ్డి ఇపుడు రాజకీయంగా ఎదురులేని పరిస్తితుల్లో ఉన్నానని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా తనకు  తిరుగులేదని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మేడ్చల్ లో పరిస్తితులు చూస్తుంటే మల్లారెడ్డికి పూర్తి పాజిటివ్ కనిపించడం లేదు. ఆయనకు సొంత పార్టీలోనే వ్యతిరేకత పరిస్తితులు ఉన్నాయి. రాజకీయంగా ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లడం..ఏం చేసిన ప్రజలు తన వైపే ఉంటారనే ధీమాతో ఉన్నారు. కానీ మేడ్చల్ లో రాజకీయం వేరుగా ఉంది.

 

గత ఎన్నికల్లోనే భారీ  మెజారిటీతో గెలిచాం కాబట్టి ఈ సారి ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని ఊహిస్తున్నారు. గత ఎన్నికల్లో 87 వేల ఓట్ల భారీ మెజారిటీతో మల్లారెడ్డి గెలిచారు. అయితే అప్పుడు బి‌ఆర్‌ఎస్ వర్గాలన్నీ సహకరించాయి. కానీ ఇప్పు దూ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డితో మల్లారెడ్డికి కయ్యం వచ్చింది.

తాజాగా ఓ సభలో ఆయన మాట్లాడుతుండగా, మల్లారెడ్డి మైకు లాగేసుకోవడంతో పెద్ద రచ్చ జరిగింది. దీంతో మేడ్చల్ లో ఎవరికి వారికే గ్రూపులు గా ఏర్పడ్డారు. ఈ గ్రూపు రాజకీయం వల్ల మల్లారెడ్డికే నష్టమని చెప్పవచ్చు. అందరినీ కలుపుకుని వెళ్లకపోతే మల్లారెడ్డికి  నెక్స్ట్ ఎన్నికల్లో డ్యామేజ్ జరగడం ఖాయమే.

Read more RELATED
Recommended to you

Latest news