మీరు కూడా రాగి పాత్రలని వాడుతుంటారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..!

-

చాలా మంది ఇంట్లో రాగి పాత్రలని ఉపయోగిస్తున్నారు రాగి పాత్రలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని.. రెగ్యులర్ గా రాగి పాత్ర లో వంట చేసుకోవడం రాగి పాత్ర లో నీళ్లు తాగడం వంటివి చేస్తూ ఉంటారు మీరు కూడా ఎక్కువగా రాగి పాత్రలని ఉపయోగిస్తూ ఉంటారా.. అయితే కచ్చితంగా నష్టాలు చూడాల్సిందే. రాగి పాత్రల వల్ల ఈ నష్టాలు తప్పవు. ఇక రాగి పాత్రల వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కాళీ కడుపుతో చాలా మంది రాగి పాత్రలలో ఉంచిన నీళ్లను తాగుతూ ఉంటారు అయితే వేసవికాలంలో రాగి పాత్రలో ఉంచిన వాటిని తీసుకోవడం వలన పలు నష్టాలు కలుగుతాయి రాగి వేడిని కలిగిస్తుంది. రాగి పాత్రలో ఆహారం తీసుకోవడం వలన ఒంట్లో వేడి కూడా విపరీతంగా ఎక్కువైపోతుంది దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రాగి పాత్రలో నీళ్లు వేసుకుని తాగడం వలన నష్టాలు ఏమీ ఉండవు. కానీ రోజుకి మూడు గ్లాసులు వరకు మీరు రాగి పాత్రలో ఉంచిన నీళ్లు తీసుకోవచ్చు.

ఎక్కువ నీళ్ళని రాగి పాత్రలో ఉంచి తీసుకుంటే నష్టాలు తప్పవు. మెటబాలిజం కి సంబంధించి సమస్యలు అజీర్తి సమస్యలు వంటివి కలుగుతాయి రాగి పాత్రలో ఉంచిన ఆహారాన్ని తీసుకుంటే ఆకలి తగ్గుతుంది కాబట్టి వేసవికాలంలో ఇలా చేయకండి. డయరియా వంటి ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాలి. వికారం వాంతులు వంటివి కూడా రావచ్చు. రాగి పాత్రలో పాలు పోసుకుని తీసుకోవద్దు. పుల్లటి వాటిని రాగి పాత్రలో తీసుకోవడం వలన వాంతులు గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news