బాలినేని రివర్స్..వైసీపీ కోవర్ట్ ఆపరేషన్.!

-

వైసీపీ: ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఏం జరుగుతుంది…జగన్‌కు సన్నిహితంగా ఉన్నవారే ఎందుకు దూరం అవుతున్నారు? నిజంగానే సొంత పార్టీపై అసంతృప్తి ఉందా? లేక ఇదేమైనా కోవర్టు ఆపరేషన్? అనేది అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అధికార వైసీపీపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే..అది కూడా సి‌ఎం జగన్ కంటే..ఎమ్మెల్యేలపై ఎక్కువ ఉంది. అలాగే ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్న పరిస్తితి.

ఇటు ఎమ్మెల్యేలు గాని, ముఖ్య నేతలు గాని..వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అసంతృప్తి, అలాగే అధికారంలో ఉంటూ కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే భావన..ఇంకా నెక్స్ట్ సీటు దక్కదనే డౌట్ తో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమవుతూ వస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. అలాగే కొందరు కీలక నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇదే క్రమంలో జగన్ బంధువు..వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు..ఈయన మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి అసంతృప్తిగానే ఉన్నారు.

వైసీపీ
వైసీపీ

అలాగే ఇటీవల జగన్ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ విషయంలో బాలినేనికి అవమానం జరిగింది. దీని తర్వాత బాలినేని రివర్స్ అయ్యారు..ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ పెద్దలు ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అటు జగన్ కూడా బాలినేనితో మాట్లాడారు. అయినా సరే బాలినేని వెనక్కి తగ్గలేదు. పదవి మళ్ళీ చేపట్టానని చెప్పేశారు.

ఇదే క్రమంలో ఆయన వైసీపీకి షాక్ ఇచ్చి…జనసేన వైపు వస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వైసీపీలో పెను తుఫాన్ తప్పదు. కానీ అదే సమయంలో ఇదేమైనా కోవర్టు ఆపరేషన్ అనే డౌట్ కొందరు విశ్లేషకులు వస్తుంది. ఎందుకంటే జగన్ తో సన్నిహితంగా ఉన్నవారే దూరం అవుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి విధేయుడు పార్టీకి దూరమయ్యారు. దశాబ్దాల కాలం నుంచి వైఎస్ ఫ్యామిలీతో ఉన్న మేకపాటి ఫ్యామిలీలోని చంద్రశేఖర్ రెడ్డి దూరమయ్యారు.

ఇక జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ 2 అన్నట్లు ఉన్న విజయసాయిరెడ్డి కూడా దూరమైనట్లే కనిపిస్తున్నారు. ఇప్పుడు బాలినేని వంతు..ఇక వీరు ప్రతిపక్షాల వైపుకు వచ్చి..కోవర్టు ఆపరేషన్ చేసి..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తారని, టి‌డి‌పి లేదా జనసేనలో గెలిచి వైసీపీలోకి వచ్చేస్తారని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే టి‌డి‌పి, జనసేనలు అలెర్ట్ గా ఉండాలి..కాకపోతే వైసీపీకి భారీ దెబ్బ తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news