భార్య పిల్లలు లేని ఒక నిస్వార్థ బ్యాచిలర్ ప్రధాని అయితే ఎలా ఉంటుందో మోదీని చూడమన్నారు. కానీ ఇప్పుడు ఆ మోదీని మించిన మొనగాడు వచ్చాడనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాషాయ దుస్తులతో కామ్‌గా కనిపించే వ్యక్తిత్వం. విపక్షాలు ఎన్ని ఎదురుదాడులు చేసినా సహనం కోల్పోని నైజం. ఆయనే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.మోడీ తరువాత దేశానికి కాబోయే ప్రధాని అతనే అని దేశమంతా చర్చించుకుంటున్నారు. అంత క్రేజ్ రావడానికి అసలు యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నారు. ఇంతకీ మోదీకి అసలు వారసుడు అతనేనా..
నిన్న మొన్నటి వరకు దేశంలో పాపులర్ పొలిటీషియన్ ఎవరని అడిగితే ట్రెండింగ్‌లో ఉన్న పేరు నరేంద్ర మోదీ. కానీ ఇప్పుడదే ట్రెండింగి్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ములాయం సింగ్ యాదవ్, మాయావతి, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రుల పాలన చూశారు యుపీ ప్రజలు. కానీ ప్రస్తుతం ఆ రాష్ర్టంలో పరిపాలన సాగిస్తున్న యోగి లాంటి వ్యక్తిని మునుపెన్నడూ చూడలేదంటున్నారు. ఒక సన్యాసి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఇప్పడు ప్రత్యక్ష్యంగా చూస్తున్నామని అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తన రాష్ర్టాన్ని ఎలా మార్చాలో ఆ విధంగా మారుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు యోగి.
గోవధ చట్టాన్ని బలంగా అమలు చేసిన యోగి ఆ రాష్ర్టంలోని మాంసం దుకాణాలు శాశ్వతంగా మూతపడేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించి పాన్ మసాలా వినియోగాన్ని నిషేధించారు. అధికారులు సమయానికి ఆఫీసులకు వచ్చేలా బయోమెట్రిక్‌ను అమలు చేశారు. అవినీతిని సమూలంగా పెకిలించాలనే లక్ష్యంతో ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మానస సరోవర్ యాత్రికులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం…. ఇలా ఒకటా రెండా అనేకమైన కీలక నిర్ణయాలతో రాష్ర్ట రూపురేఖలను మార్చేశారు యోగి. ముఖ్యంగా గ్యాంగ్స్టర్లు, రౌడీలు, మాఫియా గుండెల్లో రైళ్ళు పరుగెత్తించారు. అసెంబ్లీ వేదికగా మాఫియా అంతు చూస్తానని చెప్పిన ఆదిత్యనాథ్ ఆ దిశగా కఠినమైన వైఖరినే అవలంబించారు. అందుకే యూపీలో ఇప్పుడు యోగి అంటే ఒక సెన్సేషన్. ఆయనే ఒక ఎమోషన్‌గా మారిపోయారు. అందుకే మోడీ తరువాత వారసుడు ఆయనేనని డిసైడ్ చేసేశారు.
గుజరాత్‌లాగే ఉత్తరప్రదేశ్ కూడా హిందుత్వానికి ప్రాధాన్యతను ఇచ్చే రాష్ర్టం. కాశీ,వారణాసి వంటి పుణ్యక్షేత్రాలు కలిగిన రాష్ర్టంలో ప్రశాంత వాతావరణం తీసుకువచ్చేందుకు యోగి తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ముఖ్యంగా ఆ రాష్ర్టంలోని మహిళలు ధైర్యంగా తిరగ గలుగుతున్నారంటే ఆ క్రెడిట్ అంతా యోగీదేనని చెప్పాలి. ఇలా ఏ విధంగా చూసినప్పటికీ బీజేపీలో ప్రధాని మోదీ తరువాత జాతీయ స్థాయికి వేగంగా దూసుకువచ్చారు యోగి ఆదిత్యనాథ్.
వివాదాస్పద కామెంట్లు చేసి కాంట్రవర్సీగా మారినప్పటికీ ఎన్నికలు వస్తే ప్రజలు మాత్రం ఓట్లు దండిగా వేసి ఆయన్నే గెలిపిస్తున్నారు. మైనస్‌లు ఎన్ని ఉన్నా ప్రజల్లో పాపులారిటీ, ఆర్ఎస్ఎస్ అజెండాకు అనుకూలత ఆయన్ను మరోసారి సీఎంని చేసింది. ఆయన ఫాలోయింగ్ అమాంతం పెరగడంతో మోదీ వారసుడిగా కొత్త గుర్తింపును తీసుకువచ్చింది. గుజరాత్ సీఎం నుంచి ఇండియా పిఎంగా మోదీ వచ్చినట్లే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎం నుంచి 2024 పీఎంగా యోగిని తీసుకురావాలన్నది సంఘ్ పరివార్ ఆలోచనగా ఉంది. మోడీకి ఆయనే నిజమైన వారసుడిగా మారతారా లేక మరెవరైనా తెరమీదికి వస్తారా అనేది చూడాలి మరి.