స్వీడన్ లో సెక్స్ పోటీలు.. క్లారటీ ఇచ్చిన అధికారులు

-

సెక్స్‌ను క్రీడగా గుర్తించిన తొలి దేశంగా స్వీడన్ చరిత్రలో నిలిచిపోతుంది. గుర్తించడమే మాత్రమే కాదు మరో అడుగు ముందుకేసి తొలి యూరోపియన్ సెక్స్ ఛాంపియన్ షిప్ పేరిట ఈ నెల 8 నుంచి గోథెన్ బర్గ్ లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించబడతాయి అని కూడా వార్తలు బాగా వినిపించాయి అయితే దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Love, vastu and romance: Here's some advice for those born in the month of  February

గోటెర్ బోర్గ్స్ పోస్టెన్ అనే స్వీడిష్ మీడియా సంస్థ దీనిపై ఏప్రిల్ లోనే స్పష్టత ఇచ్చింది. సెక్స్ చాంపియన్ షిప్ ప్రతిపాదన వచ్చింది నిజమేనని, కానీ అధికార వర్గాలు ఈ సెక్స్ టోర్నీకి అనుమతి ఇవ్వలేదని ఆ మీడియా సంస్థ అప్పట్లోనే పేర్కొంది. గోటెర్స్ బోర్గ్స్ పోస్టెన్ మీడియా సంస్థ కథనం ప్రకారం… స్వీడన్ లో ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ అనే సంస్థ ఉంది. దాని అధినేత డ్రాగన్ బ్రాక్టిక్. మానవాళిపై శారీరకంగా, మానసికంగా శృంగారం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు సెక్స్ చాంపియన్ షిప్ నిర్వహించాలని తలపెట్టాడు. స్వీడన్ లో క్రీడా పోటీలు జరపాలంటే నేషనల్ స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ లో సభ్యత్వం తప్పనిసరి. అయితే, ఈ స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ లో సభ్యత్వం కోరుతూ డ్రాగన్ బ్రాక్టిక్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ దాఖలు చేసిన దరఖాస్తును స్వీడన్ అధికారవర్గాలు తిరస్కరించాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news