నేడు మంచిర్యాలకు కేసీఆర్.. మూడు పథకాలకు శ్రీకారం

-

నేడు మంచిర్యాల కు సీఎం కేసీఆర్ పయనం కానున్నారు. ఈ క్రమంలో మూడు పథకాలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. రెండవ విడత గొర్రెల పంపిణీ,కుల వృత్తులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఐ డీ ఓ సీ కలెక్టరేట్, బీ ఆర్ ఎస్ భవనం ప్రారంభించ నున్న సిఎం…పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు.

సాయంత్రం నస్పూర్ బహిరంగ సభ లో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… సీఎం హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు మంచిర్యాల జిల్లా చేరుకుంటారు.5.10 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయం ప్రారంభిస్తారు. 5.15 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరి 5.30కు భవనాన్నిప్రారంభించనున్నారు. అక్కడి నుంచి 6.30కి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు.అక్కడ ప్రజలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news