ఎడిట్ నోట్: ‘వారాహి’తో దూసుకెళ్తారా?

-

eఅటు జగన్..నిత్యం ఏదొక కార్యక్రమం పేరుతో ప్రజల్లోనే ఉంటున్నారు. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుడు గాని, అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు గాని..ఇలా ఏదొక కార్యక్రమంతో భారీ సభలు నిర్వహిస్తూ జగన్ వారి మధ్యలోనే ఉంటున్నారు. అలాగే తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెబుతూనే..ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. మళ్ళీ తమని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే ఇప్పుడు పథకాలు కొనసాగుతాయని అంటున్నారు.

ఇక ఇటు ప్రతిపక్ష నేత, టి‌డి‌పి అధినేత చంద్రబాబు సైతం ప్రభుత్వంపై పోరాటం చేస్తూ కొన్ని కీలక కార్యక్రమాలు నిర్వహిస్తూ..భారీ రోడ్ షోలు, సభల్లో పాల్గొంటున్నారు. జగన్ ప్రభుత్వం వల్ల ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయని, ఆర్ధిక పరిస్తితి దిగజారిందని, పథకం పేరుతో రూపాయి ఇస్తూ..పన్నుల రూపంలో వంద రూపాయిలు కొట్టేస్తున్నారని, అభివృధ్ది లేదని, ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు, అరెస్టులు చేస్తున్నారని, కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాన్ని దించి టి‌డి‌పిని అధికారంలోకి తీసుకురావాలని బాబు ప్రజలని కోరుతున్నారు. అలాగే బాబుకు అండగా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.

ఇలా ప్రధాన పార్టీలు ప్రజల్లోనే ఉంటున్నాయి. తమ పార్టీలని బలోపేతం చేసుకుంటున్నాయి. కానీ జనసేన అధినేత పవన్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు. సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉంటూ పార్టీని అనుకున్న విధంగా బలోపేతం చేయలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. దీంతో పవన్ జూన్ 14 నుంచి వారాహితో యాత్ర చేయనున్నారు. ప్రజలని కలవనున్నారు. భారీ సభల్లో పాల్గొనున్నారు. అలాగే జనసేనకు పట్టున్న స్థానాల్లో పర్యటిస్తూ…అక్కడ పార్టీ బలాన్ని మరింత పెంచాలని చూస్తున్నారు.

ఎలాగైనా పార్టీని రేసులోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే వారాహి యాత్ర జనసేనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని రోజులు యాత్ర చేసి మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు..పవన్ కంటిన్యూగా జనంలోనే ఉంటేనే జనసేన బలం పెరుగుతుంది. చూడాలి మరి వారాహితో పవన్ దూసుకెళ్తారేమో.

Read more RELATED
Recommended to you

Latest news